Invasions on Kakatiya Dynasty
ఓరుగల్లుపై తురుష్కుల దండయాత్రలు
కొన్ని గ్రంధాల ప్రకారం ఓరుగల్లుపై 8 సార్లు, మరికొన్ని గ్రంథాలు 5 సార్లు దండయాత్రలు చేసినట్లుగా వివరిస్తున్నాయి. కాని చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 5 సార్లు దండయాత్రలు చేసినట్లుగా పేర్కొన్నారు.
ఈ దండయాత్రలకు సంబంధించి ఆధారాలు
- అమీర్ ఖస్రు రచనలు
- అబ్దుల్ వాసప్ రచనలు
పైన పేర్కొన్న గ్రంధాలు 5 సార్లు దండయాత్ర చేసినట్లుగా ఉన్నాయి.
ఈ క్రింది పేర్కొన్నవి 8 సార్లు దండయాత్ర చేసినట్లుగా ఉన్నాయి.
- కాసే సర్వప్ప - ప్రతాప చరిత్ర
- ప్రోలయ్య నాయకుడు -- విలాస శాసనం
- కలువచేరు శాసనం
మొదటి దండయాత్ర 1303
- ఆ నాటి ఢిల్లీ సుల్తాను అల్లా ఉద్దీన్ ఖిల్జీ (1296-1316)
- దండయాత్ర జరిపిన సేనాపతి మాలిక్ ఫక్రుద్దీన్ జునా
- ఉప్పరపల్లి (కరీంనగర్) యుద్ధంలో కాకతీయ సైన్యం చేతిలో ఓడిపోయారు
- అతనిని ఓడించిన కాకతీయ సేనాపతులు రేచర్ల వెన్నడు, కొలిగింటి మైలి
రెండవ దండయాత్ర 1309-10
- ఆ నాటి ఢిల్లీ సుల్తాను అల్లా ఉద్దీన్ ఖిల్జీ (1296-1316)
- ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది మాలిక్ కాఫర్
- ఇతను ఓరుగల్లుపై దాడి చేసిన మార్గం బసీర్గర్ - సర్బార్ - కూనర్ బార్ - హనుమకొండ - వరంగల్
- 2వ ప్రతాపరుద్రుడు సంధి చేసుకున్నాడు
మూడవ దండయాత్ర 1317-18
- ఆ నాటి ఢిల్లీ సుల్తాను ముబారక్ ఖిల్జీ (1316-20)
- ఈ దండయాత్రలకు నాయకత్వం వహించింది ఖుస్రూ ఖాన్ (అమీర్ ఖుస్రూ)
- ఈ దండయాత్రలో ప్రతాపరుద్రుడు సంధి చేసుకున్నాడు
నాల్గవ దండయాత్ర 1321-22
- ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాను గియాజుద్దీన్ తుగ్లగ్ (1320-25)
- ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది జునాఖాన్ మొహ్మద్ బిన్ తుగ్లక్
- ఆయన వెంట వచ్చిన జ్యోతిష్యుడు ఉభయ్యద్ తన తండ్రి గియాజుద్దీన్ తుగ్లక్ మరణించాడని ఊహించి చెప్పడం వల్లన వెనుతిరిగిన ఢిల్లీ సైన్యాలను కొలచెలను యుద్ధంలో ఓడించిన వారు ఏచనాయక (కొసగి వంశం)
ఐదవ దండయాత్ర 1323
- ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాను గియాజుద్దీన్ తుగ్లక్
- ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది జునాఖాన్ మొహ్మద్ బిన్ తుగ్లక్
- ఈ దండయాత్రలో కాకతీయ సైన్యం ఓడిపోయి ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిపోయింది
- యుద్ధ సమయంలో సైన్యం నుండి వైదొలిగి శత్రువుల పక్షాన చేరి కాకతీయుల ఓటమికి పరోక్షంగా కారణమైనవాడు -- బొబ్బారెడ్డి
Tags: Kakatiya Dynasty study material in telugu, Kakatiya Dynasty notes in telugu, Kakatiya Dynasty class room notes in telugu, ts studies,Kakatiya Dynasty kings list in telugu, list of Kakatiya Dynasty kings
