Grandhalayodyamam in Telangana
- తెలుగువారు తమ గత చరిత్రను తెలుసుకొనుట కొరకు చేసిన ప్రయత్నమే గ్రంథాలయ ఉద్యమం
- గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడు, పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు
- తెలుగు వారి చరిత్రను వివరించే పుస్తకాలను తెలుగు భాషలోనే రచించి, వాటిని గ్రంథాలయాలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం గ్రంథాలయ ఉద్యమ ప్రధాన లక్ష్యం
- సురవరం ప్రతాపరెడ్డి గారు గ్రంథాలయ ఉద్యమమే తెలంగాణలోని తొలి ఉద్యమంఅని పేర్కొన్నారు
- దీనిలో భాగంగానే తెలంగాణలో అనేక గ్రంథాలయాలు, సంస్థలు స్థాపించబడ్డాయి
- గ్రంథాలయ ఉద్యమ పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు.
- ఇతను ఈ క్రింది గ్రంథాలయాలు, సంస్థలను స్థాపించాడు
శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం
- దీన్ని 1901 సెప్టెంబర్ 1న హైదరాబాద్(కోఠి)లో స్థాపించారు
- ఇది హైదరాబాద్‌లో మొదటి తెలుగు గ్రంథాలయంగాపరిగణించబడుతుంది
- దీని స్థాపనకు మునగాల రాజు నాయని వెంకటరంగారావు ధనసహాయం చేశాడు.
రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం
- 1904 ఫిబ్రవరి 2న హనుమకొండలో పింగళి వేంకటరామారెడ్డి ఇంట్లో స్థాపించారు
ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం (1905) - సికింద్రాబాద్
విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి (1906) - హైదరాబాద్
- విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి ద్వారా నవలల పోటీలు నిర్వహించేవారు
- విజ్ఞాన చంద్రిక మండలి 1910లో ఆంధ్రుల చరిత్ర పుస్తకాన్ని ప్రచురించింది
- చిలుకూరి వీరభద్రరావుచే రచించబడిన ఆంధ్రుల చరిత్ర గ్రంథంలో తెలుగు వారి గత వైభవం గురించి పేర్కొనబడినది
- ఈ గ్రంథం ఆంధ్రాలో మరియు తెలంగాణాలోని తెలుగు వారిని పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది
- ప్రాచీన, మధ్య యుగాలలో తెలుగువారి వైభవం గురించి ఈ గ్రంథంలో వివరించబడింది
- తెలంగాణలో కొమర్రాజు లక్ష్మణరావు కంటే ముందే అనేక మంది ఈ క్రింది గ్రంథాలయాలను స్థాపించారు
1872:
- సోమసుందర మొదలియారు సికింద్రాబాద్‌లో గ్రంథాలయాన్ని స్థాపించాడు.
- ఇది తెలంగాణలోనే కాక తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి గ్రంథాలయంగా పేర్కొనవచ్చు.
- ఈ గ్రంథాలయాన్ని 1884లో మహబూబియా కాలేజిలో విలీనం చేశారు
- ఇదే సంవత్సరంలో ముదిగొండ శంకరాధ్యులు శంకరానంద గ్రంథాలయం అనే పేరుతో కవాడిగూడలోని శంకరమఠంలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు
1879:
- అఘోరనాథ్ ఛటోపాధ్యాయ యంగ్‌మెన్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీని స్థాపించి, అందులో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు
- చేశాడు.
- అఘోరనాథ్ ఛటోపాధ్యాయ భార్య వరదసుందరీదేవి తన ఇంట్లోనే రాత్రి బడిని నిర్వహించి, మహిళలకు విద్యాబోధన చేసేవారు. ఆ విధంగా ఆ ఇల్లు అఘోరనాథ్ దర్చార్‌గా పిలువబడింది
- అఘోరనాథ్ ఛటోపాధ్యాయ ముల్లా అబ్బుల్ ఖయ్యూం సహాయంతో బ్రదర్‌హుడ్ సొసైటీని స్థాపించాడు
1891:
- అసఫియా స్టేట్ లైబ్రరీని స్థాపించారు
- స్థాపకులు - ముల్లా అబ్బుల్ ఖయ్యూం, నవాబ్ ఇమాదుల్ ముల్క్ (అసలు పేరు మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామి)
- ఈ గ్రంథాలయాన్నే నేడు స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా పిలుస్తున్నారు.
1895 :
- హైదరాబాద్ రాజ్యంలో మరాఠి భాషా సంస్కృతుల అభివృద్ధికోసమె భారత గుణవర్ధక సంస్థ గ్రంథాలయాన్ని 1895
- మార్చి 27న స్థాపించింది.
శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం
- గ్రంథాలయం ఏర్పడిన తర్వాత
- కొమర్రాజు లక్ష్మణరావు 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం గ్రంథాలయం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో పెద్దఎత్తున గ్రంథాలయ ఉద్యమం వ్యాప్తి చెందింది
- ఈ ఉద్యమంతో ప్రభావితమై అనేకమంది ఈ క్రింది గ్రంథాలయాను స్థాపించారు
1908:
- శబ్దానుశాసన ఆంధ్ర భాషానిలయంను వరంగల్‌లోని మట్టెవాడలో 1908 మే 22న ముదిగొండ శంకరాచార్యులు స్థాపించారు
- ముదిగొండ శంకరాచార్యులు ఈ గ్రంథాలయానికి తన సొంత ఇంటిని దానం చేశారు
- ఈ గ్రంథాలయంలో లభించిన తెలంగాణ కవుల వివరాలను బట్టి సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచికను విడుదల చేశారు
- గోల్కొండ కవుల సంచిక ఆధునిక కాలంలో వెలువడిన మొట్టమొదటి తెలుగు కవితా సంకలనం
- బద్దిరాజు సోదరులైన సీతారామచంద్రారావు, రాథువ రంగారావులు నిర్వహించిన 'తెనుగు' అనే పత్రికకు ఈ గ్రంథాలయం పంపిణీ కేంద్రంగా పనిచేసింది
1918:
- అంధ్ర సరస్వతీ గ్రంథనిలయంను 1918 మార్చి నెలలో నల్గొండలో స్థాపించారు
- నిర్వాహకులు - షబ్బవీసు వెంకట రామనర్సింహారావు
- ఈ గ్రంథాలయంలో మహబూబియా రీడింగ్ రూమ్ మరియు షబ్నవీసు సొంతంగా ఏర్పాటు చేసుకున్న గ్రంథాలయం విలీనమైనాయి
1918:
- అంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయంను 1918లో సూర్యాపేటలో పువ్వాడ వెంకటప్పయ్య స్థాపించారు
- కృషి ప్రచురిణే గ్రంథమాల అనే ఒక సంస్థను స్థాపించి తెలుగు పుస్తకాలను ముద్రించాడు
1918:
- శ్రీ విజ్ఞాన విద్యుత్ ప్రవాహిన్యాంధ్ర భాషా నిలయంను 1918లో ఖమ్మంలో స్థాపించారు
- యల్లాప్రగడ కృష్ణమూర్తి, కోదాటి నారాయణరావులు కలసి జ్యోతి అనే ఒక లిఖిత మాన పత్రికను ఈ గ్రంథాలయం నుండి వెలువరించారు
- ఈ గ్రంధాలయం తర్వాత కాలంలో విద్యార్థి గ్రంథాలయంగా మారింది
- నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చెందిన ఫార్వర్డ్ బ్లాక్ పత్రిక ఈ గ్రంథాలయానికి వచ్చేది
- ఈ గ్రంధాలయం తరవున హరిజనవాడలో రెండు పాఠశాలలు నిర్వహించేవారు
1918:
- రెడ్ది హాస్టల్ గ్రంథాలయంను రాజబహదుర్ వెంకట రామారెడ్డి 1918లో హైదరాబాద్‌లో స్థాపించారు
- ఈ గ్రంథాలయంలో వి.డి.సావర్కర్ రచించిన వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ గ్రంథం ఉండడం వల్ల ప్రభుత్వం ఈ గ్రంథాలయాన్ని నిషేధించింది.
- 1924 నుండి 1982 వరకు సురవరం ప్రతాపరెడ్డి ఈ గ్రంథాలయానికి ఉచిత కార్యదర్శిగా పనిచేశారు.
- ఇదే సమయంలో సురవరం ప్రతాపరెడ్డి గారు గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి తెలంగాణ-ఆంధ్రుల కర్తవ్యం అనే పుస్తకాన్ని రచించారు.
1921 :
- బహిరామియా గ్రంథాలయం 1921 ఏప్రిల్ 6న కొలనుపాకలో స్థాపించబడింది
1923:
- విజ్ఞాన ప్రచారిణీ గ్రంథాలయంను 1923లో మంథనిలో అవధాని కృష్ణయ్య స్థాపించారు
- దీన్ని ఉస్మానియా ఆంధ్ర భాషానిలయం అని కూడా పిలిచేవారు
- 1930:
- శ్రీ సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయం 1930లో సింగరేణిలో స్థాపించారు
- ఈ గ్రంథాలయానికి సొంత భవనమును మరియు రేడియోను సింగరేణి కాలరీస్ కంపెనీ సమకూర్చింది
1934:
- శ్రీ ఆంధ్రభాష ఉద్ధారక గ్రంథాలయం1934లో పెదగోపవరంలోమామునూరు నాగభూషణరావు, ఉప్పల వేంకటేశ్వరశాస్త్రి, జమలారెడ్డి ఒద్దిరాజు నారాయణరావులు స్థాపించారు
- ఒక వయోజన విద్యాలయం ఈ గ్రంథాలయానికి అనుబంధంగా నిర్వహించబడేది
1939:
- విద్యాభివర్థినీ గ్రంథాలయంను 1989లో తోటవల్లి (కరీంనగర్)లో బోయినపల్లి వేంకట రామారావు స్థాపించారు
- ఈ గ్రంథాలయానికి అనుబంధంగా ఒక హరిజన పాఠశాలను, ఒక వయోజన పాఠశాలను, ఒక సంచార గ్రంథాలయమును, ఒక ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారాన్ని వేంకట రామారావు స్థాపించారు
1943:
- శ్రీ హనుమదాంధ్ర గ్రంథాలయం 1948లో ములకలపల్లి (ఖమ్మం)లో స్థాపించబడింది
- ఈ గ్రంథాలయం ఆంధ్ర సారస్వత పరిషత్ వారిచే స్థాపించబడింది
- ఉమ్మెత్తల రామానుజరావు పిల్లలమర్రి (సూర్యాపేట)లో వివేక వికాసినీ గ్రంథాలయంను స్థాపించాడు
సంచార గ్రంధాలయం :
- తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకా ప్రాంతాన్ని పరిగణిస్తారు
- ఆర్మూర్ తాలూకా అధికారిగా పనిచేషే అయ్య టి కె బాలయ్య తాలూకా పరిధిలోని మారుమూల గ్రామాలకు ఎడ్లబండిపై వెళ్లి పుస్తకాలను పంపిణీ చేసి, తను అంతకు ముందు ఇచ్చిన పుస్తకాలను తీసుకుని వచ్చేవాడు
ఆంధ్రభాష గ్రంథాలయ మహాసభలు
ప్రథమ మహాసభ:
- జరిగిన ప్రదేశం - బెజవాడ (1914)
- ప్రారంభించినది - అయ్యంకి వెంకట రమణయ్య
2వ మహాసభ:
- జరిగిన ప్రదేశం - రాయచూర్ జిల్లా అలంపూర్ తాలూకాలోని క్యాతూర్ (1946 మార్చి 1-3)
- సభాధ్యక్షుడు - రాజబహదూర్ వెంకటరామారెడ్డి
- ఆంధ్రభాష గ్రంథాలయ మహాసభ వారు తమ ప్రచార కార్యక్రమాలను 3 భాగాలుగా విభజించారు
- 1) వయోజనశాఖ 2) విద్యాశాఖ 3) సాంకేతికశాఖ
తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించి మరికొన్ని ముఖ్య గ్రంథాలయాలు



