The System of Vetti and Bhagi in Telangana తెలంగాణాలో వెట్టి, భగీలవ్యవస్థ
వెట్టివిధానం:- ఒకవ్యక్తి లేదాఒకసంఘాన్ని శారీరకనిర్బంధానికి గురిచేసి, వారితోచాకిరీచేయించుకుని ప్రతిఫలాన్ని ఇవ్వకపోగా, వారినుండేవసూళ్లను (ధన రూపం/వస్తు రూపం) బలవంతంగా రాబట్టుకుని వారిశ్రమనువారిజీవితాలను దోచుకునే విధానమే వెట్టి విధానం
- ప్రతిదళిత కుటుంబం వెట్టిచాకిరీ చేయటానికి కుటుంబంలోని ఒక్కరిని కేటాయించవలసి ఉండేది. చిన్నపల్లెలో ప్రతిఇంటినుండి ఒకమనిషిని పంపడంజరిగింది. పటేల్ పట్వారి, మాలిపటేల్ లేదా దేశ్ముఖ్ ఇండ్లలో గృహ సంబంధమైన పనులుచేయటం, పోలీస్స్టేషన్ లకు, తాలూకాపీసులకు రిపోర్టులను మోసుకెళ్ళడం, గ్రామచావిడికి, బందిలిదొడ్డికి కాపలాకాయడంరోజువారి పనిలోభాగమే. ఇదికాక గ్రామ చావిడికి ఎవరైనాఅధికారి వచ్చినప్పుడు వాళ్లకు మరింతఎక్కువపనిఉండేది. చిలుకూరు గ్రామంలో ప్రతి రోజు 16 మందిహరిజనులు వెట్టిచాకిరీ చేస్తుండేవారు. అడవుల నుండికట్టెలు కొట్టితెచ్చేవారు. టపా మోసుకెళ్లే వారు. టపా గాని, ఇతరసరఫరాలను మోసికెళ్ళినందుకు వారికిరెండున్నర మైళ్లకు ఒకఅణా చొప్పున ఇవ్వబడుతునట్లు కాగితాల మీద ఉండేది. అయితే ఆచరణలోఅదికూడాఇచ్చేవారు కారు. ఈ విధానాన్ని 'కోసుకు వీసం' అనేవారు
చర్మకారులు:- చర్మకారుల గాపనిచేసే దళితులు తోళ్లను పదును చేసిచెప్పులు కుట్టినందుకు, వ్యవసాయ పనులకు, బావుల నుండి నీరు తొడడానికి, అవసరమైన తోలుపరికరాలు తయారుచేసినందుకు, అరకలకు పట్టీలు తయారు చేసినందుకు భూస్వాములు ఏమీచెల్లించేవారు కాదు. దళితులు భూస్వాములకు వాటిని ఉచితంగానే సరఫరాచేయవలసి వచ్చేది. మిగతా రైతాంగం మాత్రంఆ దళితులకు ధాన్యరూపం లోనూ, ఇతర వ్యవసాయ పంటలరూపంలోనూ నిర్ణితమైన మేరచెల్లించేవారు
బోయలు, బెస్తలు, రజకులు:- బోయలు, బెస్తలు, రజకులవంటిమరికొన్ని ఇతరవెనుకబడిన కులాలవారు భూస్వామి కుటుంబాలకు చెందినపురుషులను, స్త్రీలను పల్లకిలోనో, మేనాలోనో ఎక్కించుకొని తమభుజాలమీదమోసుకువెళ్ళవలసి వచ్చేది. తమ బంధువులను చూచిరావాలిఅనుకున్నప్పుడు, తీర్థాలూ, తిరునాళ్లను సందర్శించవలసినప్పుడల్లా భూస్వాములు ఆ విధంగా వారిచే నిర్బంధంగా మోయించుకునేవారు. భూస్వామి కుటుంబాల వారువేగంగానడిచేఎడ్లబండ్లలో ప్రయాణం చేసేటప్పుడు బండిముందుదారిబాగుచేయడానికి, బండివెనకకాపలాదారుగా వారుపరుగెత్తాల్సి వచ్చేది. వారు గుర్రాలపై స్వారీచేసేటప్పుడు గుర్రాల వద్దపనిచేసే వ్యక్తులు వాటివెంటపరుగెత్తాల్సి ఉండేది.
కల్లుగీతకార్మికులు:- కల్లుగీత కార్మికులు కల్లుగీతగీతగీస్తూ, భూస్వాముల కుటుంబాలకు ఉచితంగా సరఫరాచేయడంకోసం5 నుండి10 చెట్లవరకుప్రత్యేకంగా వారికోసం కేటాయించి ఉండాలి. వారికి రోజుకు ఐదుకుండలకల్లు సరఫరా చేయాలి. పండుగలు పబ్బాలప్పుడు మరింతఎక్కువకల్లు ఇచ్చిరావాలి.
చేనేతపనివారు:- చేనేతపనివారు భూస్వాముల ఇళ్ళలోపనిచేసే నౌకర్లలకు బట్టలుసరఫరాచేయాలి. వడ్రంగులు, కమ్మరులు భూస్వాములకు వ్యవసాయ పరికరాలన్నీ ఉచితంగా సరఫరా చేయాలి. మరమ్మతులను ఈ విధంగానే చేయాలి.
రజకులు, దేశ్ముఖ్లు:- రజకులు, దేశ్ముఖ్లుగ్రామఅధికారుల ఇళ్లల్లో బట్టలుఉతకాలి, అంట్లుతోమాలి, గ్రామచావిడిలో మకాంవేసినఅధికారుల కొరకుమంచాలు, పరుపులు మోసుకెళ్లాలి. వంట చేయడానికి అవసరమైన అన్నీచేరవేయాలి. వారే అధికారుల ఇళ్లల్లో పసుపుకారంకొట్టాలి.
The System of Vetti and Bhagi in Telangana
తెలంగాణాలో వెట్టి, భగీలవ్యవస్థ
వెట్టివిధానం:
- ఒకవ్యక్తి లేదాఒకసంఘాన్ని శారీరకనిర్బంధానికి గురిచేసి, వారితోచాకిరీచేయించుకుని ప్రతిఫలాన్ని ఇవ్వకపోగా, వారినుండేవసూళ్లను (ధన రూపం/వస్తు రూపం) బలవంతంగా రాబట్టుకుని వారిశ్రమనువారిజీవితాలను దోచుకునే విధానమే వెట్టి విధానం
- ప్రతిదళిత కుటుంబం వెట్టిచాకిరీ చేయటానికి కుటుంబంలోని ఒక్కరిని కేటాయించవలసి ఉండేది. చిన్నపల్లెలో ప్రతిఇంటినుండి ఒకమనిషిని పంపడంజరిగింది. పటేల్ పట్వారి, మాలిపటేల్ లేదా దేశ్ముఖ్ ఇండ్లలో గృహ సంబంధమైన పనులుచేయటం, పోలీస్స్టేషన్ లకు, తాలూకాపీసులకు రిపోర్టులను మోసుకెళ్ళడం, గ్రామచావిడికి, బందిలిదొడ్డికి కాపలాకాయడంరోజువారి పనిలోభాగమే. ఇదికాక గ్రామ చావిడికి ఎవరైనాఅధికారి వచ్చినప్పుడు వాళ్లకు మరింతఎక్కువపనిఉండేది. చిలుకూరు గ్రామంలో ప్రతి రోజు 16 మందిహరిజనులు వెట్టిచాకిరీ చేస్తుండేవారు. అడవుల నుండికట్టెలు కొట్టితెచ్చేవారు. టపా మోసుకెళ్లే వారు. టపా గాని, ఇతరసరఫరాలను మోసికెళ్ళినందుకు వారికిరెండున్నర మైళ్లకు ఒకఅణా చొప్పున ఇవ్వబడుతునట్లు కాగితాల మీద ఉండేది. అయితే ఆచరణలోఅదికూడాఇచ్చేవారు కారు. ఈ విధానాన్ని 'కోసుకు వీసం' అనేవారు
చర్మకారులు:
- చర్మకారుల గాపనిచేసే దళితులు తోళ్లను పదును చేసిచెప్పులు కుట్టినందుకు, వ్యవసాయ పనులకు, బావుల నుండి నీరు తొడడానికి, అవసరమైన తోలుపరికరాలు తయారుచేసినందుకు, అరకలకు పట్టీలు తయారు చేసినందుకు భూస్వాములు ఏమీచెల్లించేవారు కాదు. దళితులు భూస్వాములకు వాటిని ఉచితంగానే సరఫరాచేయవలసి వచ్చేది. మిగతా రైతాంగం మాత్రంఆ దళితులకు ధాన్యరూపం లోనూ, ఇతర వ్యవసాయ పంటలరూపంలోనూ నిర్ణితమైన మేరచెల్లించేవారు
బోయలు, బెస్తలు, రజకులు:
- బోయలు, బెస్తలు, రజకులవంటిమరికొన్ని ఇతరవెనుకబడిన కులాలవారు భూస్వామి కుటుంబాలకు చెందినపురుషులను, స్త్రీలను పల్లకిలోనో, మేనాలోనో ఎక్కించుకొని తమభుజాలమీదమోసుకువెళ్ళవలసి వచ్చేది. తమ బంధువులను చూచిరావాలిఅనుకున్నప్పుడు, తీర్థాలూ, తిరునాళ్లను సందర్శించవలసినప్పుడల్లా భూస్వాములు ఆ విధంగా వారిచే నిర్బంధంగా మోయించుకునేవారు. భూస్వామి కుటుంబాల వారువేగంగానడిచేఎడ్లబండ్లలో ప్రయాణం చేసేటప్పుడు బండిముందుదారిబాగుచేయడానికి, బండివెనకకాపలాదారుగా వారుపరుగెత్తాల్సి వచ్చేది. వారు గుర్రాలపై స్వారీచేసేటప్పుడు గుర్రాల వద్దపనిచేసే వ్యక్తులు వాటివెంటపరుగెత్తాల్సి ఉండేది.
కల్లుగీతకార్మికులు:
- కల్లుగీత కార్మికులు కల్లుగీతగీతగీస్తూ, భూస్వాముల కుటుంబాలకు ఉచితంగా సరఫరాచేయడంకోసం5 నుండి10 చెట్లవరకుప్రత్యేకంగా వారికోసం కేటాయించి ఉండాలి. వారికి రోజుకు ఐదుకుండలకల్లు సరఫరా చేయాలి. పండుగలు పబ్బాలప్పుడు మరింతఎక్కువకల్లు ఇచ్చిరావాలి.
చేనేతపనివారు:
- చేనేతపనివారు భూస్వాముల ఇళ్ళలోపనిచేసే నౌకర్లలకు బట్టలుసరఫరాచేయాలి. వడ్రంగులు, కమ్మరులు భూస్వాములకు వ్యవసాయ పరికరాలన్నీ ఉచితంగా సరఫరా చేయాలి. మరమ్మతులను ఈ విధంగానే చేయాలి.
రజకులు, దేశ్ముఖ్లు:
- రజకులు, దేశ్ముఖ్లుగ్రామఅధికారుల ఇళ్లల్లో బట్టలుఉతకాలి, అంట్లుతోమాలి, గ్రామచావిడిలో మకాంవేసినఅధికారుల కొరకుమంచాలు, పరుపులు మోసుకెళ్లాలి. వంట చేయడానికి అవసరమైన అన్నీచేరవేయాలి. వారే అధికారుల ఇళ్లల్లో పసుపుకారంకొట్టాలి.
