Role of Andhra Mahila Sabha in Nizam's State
- ఆంధ్ర మహిళా సభ ప్రారంభంలో ప్రజా సంబంధ వ్యవహారాలలో కూడా మహిళలు పాల్గొనడం మొదలైంది.
- 1980లో ఆంధ్ర మహాసభ ప్రారంభించినప్పటి నుంచి, వీటితో పాటుగా దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ప్రయత్నాల ఫలితంగా ఆంధ్ర మహిళా సభలు కూడా జరిగాయి.
- సామాజిక సంబంధమైన సమస్యలు మరియు ఈ సమస్యలకు సాధ్యమైన పరిష్కార మార్దాలను ఆంధ్రమహిళా సభలు సూచించేవి.
- ఆంధ్ర మహిళా సభ ప్రధానంగా మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా విద్య, మహిళల రాజకీయ వెనుకబాటుతనం మొదలైన సమస్యలను చర్చించి, పరిష్కరించడం కోసం ఏర్పడినది.
- ఆంధ్ర మహిళా సభను మొదట్లో ఆంధ్ర మహాసభలలో అంతర్భాగంగా నిర్వహించేవారు. కానీ 10వ ఆంధ్ర మహిళా సభ నుంచి మహిళా నభలను ప్రత్యేకంగా, విడిగా నిర్వహించారు.
- అన్నీ ఆంధ్ర మహిళా సభలలోను ప్రధానంగా స్త్రీ విద్య ఆవశ్యకత, మాతృభాషలో విద్యాభోధన, మూఢనమ్మకాలు,
- స్త్రీల స్థితిగతుల గురించి తీర్మానాలు చేశారు.
మొదటి ఆంధ్ర మహిళా సభ :
- మొదటి ఆంధ్ర మహిళా సభ 1930 సం॥లో జోగిపేటలో ఏర్పాటు చేయబడింది.
- ఆంధ్ర మహిళా సభ మొదటి సమావేశంలో 500 మంది మహిళలు సమావేశం అవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.
- దీనికి అధ్యక్షురాలుగా నడింపల్లి సుందరమ్మ వ్యవహరించారు.
- మొదటి ఆంధ్ర మహిళా సభలో ముఖ్యంగా సంస్కృతి మరియు రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం, మహిళల స్వేచ్భా మొదలైన అంశాల గూర్చి చర్చించారు
2వ ఆంధ్ర మహిళా సభ:
- రెండవ ఆంధ్ర మహిళా సభను మొదటి ఆంధ్ర మహిళా సభ జరిగిన ఒక సంవత్సరం తరువాత అనగా 1931వ సం॥లో దేవరకొండలో నిర్వహించారు
- రెండవ ఆంధ్ర మహిళా సభకు టి. వరలక్ష్మమ్మ గారు అధ్యక్షత వహించారు.
- మొదటి ఆంధ్ర మహిళా సభలో జరిగిన తీర్మానాలన్నింటిని తిరిగి రెండవ ఆంధ్ర మహిళా సభలోను పునరుద్దాటించారు
- అదే విధంగా జిల్లాలలో విద్యా, సాంకేతికవిద్య కౌన్సిల్స్‌కు సంబంధించిన ప్రత్యేక తీర్మానాలు చేశారు.
3వ ఆంధ్ర మహిళా సభ:
- మూడవ ఆంధ్ర మహిళా సభను 1934 సం॥లో ఖమ్మంలో నిర్వహించారు
- ఈ సభకు “ఎల్లాప్రగడ సీతాకుమారి” అధ్యక్షత వహించారు
- మూడవ ఆంధ్ర మహిళా సభకు 3,000 మంది కంటే ఎక్కువ మహిళలు హాజరయ్యారు.
- ఈ సభలో మహిళల విద్య, మహిళల జీవన విధానంలో రావల్సిన మార్పు మొదలైన తీర్మానాలు చేశారు
- విద్య ద్వారనే విజ్ఞానం సంపాదించగలము కావునా విద్యఅనేది అత్యంత కీలకమైనదని తీర్మానించారు
- స్రీలకు విద్య అందించడం ద్వారా మహిళా దేశభక్తులను తయారు చేయవచ్చునని తెలిపారు.
4వ ఆంధ్ర మహిళా సభ :
- 4వ ఆంధ్ర మహిళా సభ 1935 సం॥లో 'సిరిసిల్లా లో జరిగింది.
- ఈ సభకు “మాడపాటి మాణిక్యమ్మ' అధ్యక్షత వహించారు
- నిరక్ష్యరాస్యులైన మహిళల కోసం రాత్రి బడులు నిర్వహించడం, వం బాలికల తెలుగు మీడియం ఉన్నత పాఠశాలను స్థాపించడం, బాల్య వివాహాలు, బాల్య వివాహాల మూలంగా ఏ విధంగా మహిళల ఆయుర్ధాయం తగ్గిపోతున్నది మొదలైన అంశాల మీద తీర్మానం చేశారు
5వ ఆంధ్రమహిళాసభ:
- 5వ ఆంధ్ర మహిళా సభను 1936 సం॥లో “షాద్‌నగర్‌లో నిర్వహించారు
- ఈ సభకు “బూర్గుల అనంత లక్ష్మమ్మ” అధ్యక్షత వహించారు
- మహిళల పాఠశాలల నిర్వహణకు గ్రాంటులు ఇవ్వాలని, స్తీ విద్యా ప్రాముఖ్యాన్ని, ప్రభుత్వం మహిళా విద్యకు సహకరించడంలేదని, ప్రాథమిక దశ వరకు మాత్రమే మాతృభాషలో పాఠశాలలు ఉన్నాయని, ఉన్నత పాఠశాలలను
- స్తాపించాలని తీర్మాన చేసారు.
6వ ఆంధ్ర మహిళా సభ :
- 6వ ఆంద్ర మహిళా సభను నిజామాబాద్‌లో 1937లో నిర్వహించారు
- ఈ సభకు నందగిరి ఇందిరాదేవి అధ్యక్షత వహించారు
- స్త్రీల వెనుకబాటుతనం, కాలం చెల్లిన సామాజిక, మూఢనమ్మకాలపైన, విదేశీవస్తు బహిష్కరణ గురించి, పర్దా వ్యవస్థ,
- గ్రామాల్లో పారిశుద్ధ్యం, వైద్యసదుపాయాలు, మొదలగువాటి గురించి తీర్మానం చేశారు.
7వ ఆంధ్ర మహిళా సభ :
- 7వ ఆంధ్ర మహిళా సభ 1940 సం॥లో “'మల్మాపురం'లో నిర్వహించారు
- ఈ సభకు 'యోగ్య శీలాదేవి' అధ్యక్షత వహించారు
- సహాయంలేని మహిళలకు పునరావసర సౌకర్యాలు కల్పించడం, మహిళల ఆ పరిస్థితులు, సమాజంలోని స్తీ పురుష అసమానతలు మొదలగువాటి గురించి తీర్మానం చేశారు
8వ ఆంధ్ర మహిళా సభ :
- 8వ ఆంధ్ర మహిళా సభ 'చిలకూరులో” 1941లో జరిగింది
- ఈ మహాసభకు “రంగమ్మ ఓబుల్‌రెడ్డి అధ్యక్షురాలు
- స్త్రీలకు స్వేచ్చ, ఆర్థిక స్వేచ్చ మొదలైనవి అందించాలని ఈ సభ తీర్మానించింది.
9వ ఆంధ్ర మహిళా సభ:
- 9వ ఆంధ్ర మహిళా సభను 1942లో 'ధర్మారం'లో నిర్వహించారు
- 9వ ఆంధ్ర మహిళా సభలో ప్రధానంగా బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహాలు, వరకట్నం, విడాకులు మైదలైన వాటి గురించి తీర్మానం చేశారు.
10వ ఆంధ్ర మహిళాసభ:.
- 10వ ఆంధ్ర మహిళా సభను 1948లో హైదరాబాద్‌లో నిర్వహించారు
- ఈ సభకు “ఎల్లాప్రగడ సీతాకుమారి' అధ్యక్షత వహించారు.
- 10వ ఆంధ్ర మహిళా సభ నుంచి, మహిళా సభలను ప్రత్యేకంగా, విడిగా నిర్వహించడం జరిగింది.
- అంతకు ముందు ఆంధ్ర మహాసభలతో పాటు ఆంధ్ర మహిళాసభలను కూడా నిర్వహించడం రివాజు
- ఈ సమావేశాల్లో వేశ్యావ్యవస్థను రూపుమాపాలని తీర్మానం చేశారు
- 10వ ఆంధ్ర మపీళా సభ తరువాత ఆంధ్ర మహిళా సభలో చీలిక ఏర్పడింది. కావున ఈ సమావేశాలకు అధ్యక్షురాలు నియమించబడలేదు
11న ఆంధ్ర మహిళా సభ :
- 11వ ఆంధ్ర మహిళా సభను 1944 సం॥లో “భువనగిరిలో నిర్వహించారు
- నిమ్మగడ్డ సత్యవతి అధ్యక్షత వహించింది
- ఈ మహాసభలో రాష్ట్రంలోని ప్రధాన దురాచారమైన 'ఆడబాప విధానం' గురించి, బానిసత్వం మొదలైన వాటి గురించి
- తీర్మానించారు.
- ఆడబాప విధానం :
- తెలంగాణ రాష్ట్రంలో “ఆడబాపి అనేది ప్రధానంగా కనిపించే సాంఘిక దురాచారం కుటుంబంలో పుట్టినటువంటి ఆడపిల్లలను ఈ విధానంలోకి చిన్న ప్రాయం నుండే పంపబడుతారు
- ప్రధానంగా పేదవారు ఇలా తమ పిల్లల్ని ఆడబాపగా మారుస్తారు
- ఇలా మార్చబడిన బాలికలు/యువతులు జీవితకాలం వివాహం చేసుకోరాదు
- సమాజంలోని జాగిర్‌దార్లు, దొరల వద్ద అన్ని అవసరాలు తీర్చే మనిషిగా, బానిసలుగా ఉండాల్సిందే.
12వ ఆంధ్ర మహిళా సభ :
- 12 ఆంధ్ర మహిళా సభలో 1945 సం॥లో 'మడికొండలో నిర్వహించబడింది
- ఈ మహాసభలో ప్రధానంగా సమాజంలో వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాంఘిక పరమైన, మతపరమైన పుస్తకాలను మహిళలు తప్పనిసరిగా చదవాలని, సామాజిక రుగ్మతలను రూపుమాపడం వంటి ప్రధాన అంశాలను తీర్మానించారు
13వ ఆంధ్ర మహిళా సభ :
- 13వ ఆంధ్ర మహిళా సభను 1946 సం॥లో “కంది అనే ప్రాంతంలో నిర్వహించారు
- స్త్రీ విద్యా, వెట్టిచాకిరీ, ప్రసూతి సదుపాయాలు, స్త్రీల మానసిక స్థాయి, మాతృభాషలో విద్యా బోధన, పత్రికలు, పుస్తకాలు మహిళలు చదవాల్సిన ఆవశ్యకత, వేశ్యావ్యవస్థను రూపుమాపాలని తీర్మానం చేశారు.

