Role of Andhra Mahasabha in Nizams State
- తెలంగాణలో మొట్టమొదటి రాజకీయ సంస్థ - ఆంధ్ర మహాసభ
- ఆంధ్ర మహాసభ లో మొదటి తరం నాయకులందరూ మితవాదులు
- ఉదా! మాడపాటి, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మందముల నరసింగారావు, జమలాపురం కేశవరావు, పులిజాల వెంకటరంగారావు
- ఆంధ్ర మహాసభలో 2వ తరం నాయకులందరూ అతివాదులు
- ఉదా॥ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్టూం మొహియుద్దీన్, దేవులపల్లి వెంకటేశ్వరరావు
- 1930 నుండి 1946 మధ్య కాలంలో అనేక ప్రాంతాలలో ఆంధ్ర మహాసభ యొక్క సమావేశాలు జరిగాయి
- దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ప్రయత్నాల ఫలితంగా ఆంధ్రమహాసభతో పాటు సమాంతరంగా ఆంధ్ర మహిళా సభలు కూడా నిర్వహించబడ్డాయి
జోగిపేట సమావేశం - 1930 మార్చి :
- అధ్యక్షుడు- సురవరం ప్రతాపరెడ్డి
- మహిళా సభ అధ్యక్షురాలు - నడింపల్లి సుందరమ్మ
- గస్తీ నిషాన్- 53ను రద్దు చేయాలని ఈ సభ తీర్మానించింది
- 1926లో వాక్, సభ, పత్రిక స్వాతంత్రాలను హరించుట కొరకు ఈ గస్తీ నిషాన్-53 ఆర్డినెన్స్‌ను నిజాం ప్రభుత్వం తీసుకొచ్చింది. బాల్య వివాహాలను నిరోధించాలని, వితంతు వివాహాలను ప్రోత్సహించాలని తీర్మానం.
దేవరకొండ సమావేశం (నల్గొండ) - 1931 :
- అధ్యక్షుడు - బూర్గుల రామకృష్ణారావు
- ఈ సభలో కూడా గస్తీ నిషాన్-53ను రద్దు చేయాలని మరల డిమాండ్ చేశారు
- ఈ సభకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు
- 1 గూడవల్లి రామబ్రహ్మం (సినీ నిర్మాత)
- 2 మాదిరి భాగ్యారెడ్డివర్మ (ఆది హిందూ ఉద్యమకర్త)
- 3 రావి నారాయణరెడ్డి
- (స్నేహితునితో కలిసి హైదరాబాద్ నిజాం కళాశాల నుండి కాలినడకన దేవరకొండ సభకు వచ్చాడు)
ఖమ్మమ్మెట్టు - 1934 :
- అధ్యక్షుడు- పులిజాల వెంకటరంగారావు
- దేవదాసీ విధానం రద్దు చేయాలని ఈ సభ తీర్మానం చేసింది
సిరిసిల్ల (కరీంనగర్) 1935 :
- అధ్యక్షుడు - మాడపాటి హనుమంతరావు
- మహిళా సభ అధ్యక్షురాలు - మాడపాటి మాణిక్యాంబ
- ఈ సభ నిర్వహణ కొరకు వేములవాడ భీమకవి పేరు మీదుగా వేములవాడ భీమకవి నగర్ నిర్మించబడింది
- ఈ సభలో స్వపరిపాలన డిమాండ్ చేయబడింది
- తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలనే తీర్మానం ఆమోదించబడింది
- రావి నారాయణరెడ్డి ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాడు .
షాద్‌నగర్ (మహబూబ్‌నగర్) - 1936:
- అధ్యక్షుడు - కె.వి.రంగారెడ్డి
- రైతు సమస్యల గురించి ఈ సభలో చర్చించబడింది
నిజామాబాద్ - 1937:
- అధ్యక్షుడు - మందముల నరసింగరావు (రయ్యత్ పత్రిక సంపాదకుడు)
- ఇది జిల్లా ప్రధాన కేంద్రంలో జరిగిన మొదటి సభ
- పౌర హక్కులు డిమాండ్ చేయబడ్డాయి
- తెలుగుభాషను మాత్రమే ఉపయోగించాలనే నియమాన్ని ఎత్తివేయాలని రావి నారాయణరెడ్డి పట్టుబడ్డాడు. కానీ, సురవరం దీన్ని వ్యతిరేకించాడు.
మల్కాపురం -1940 :
- అధ్యక్షుడు - రామచంద్రరావు
- రాజకీయ నంస్మరణల కోనం వచ్చిన అరవముదం అయ్యంగార్ కమిటీ యొక్కనివేదిక ఈ సభలో చర్చించబడింది
- ఈ నివేదిక పూర్తిగా తిరస్కరించబడింది
చిలుకూరు (రంగారెడ్డి) -1941 :
- అధ్యక్షుడు - రావి నారాయణరెడ్డి
- ఆంధ్ర మహాసభ యొక్క సభ్యత్వ రుసుము 1 రూపాయి నుండి 4 అణాలకు తగ్గించబడింది
- తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలనే నియమం ఎత్తివేయబడింది
ధర్మారం(వరంగల్) -1942 :
- అధ్యక్షుడు - కోమటేశ్వరరావు
- ఈ సభలో అతివాదుల ఆధిపత్యం అధికమయింది
- హైదరాబాద్: మన కర్తవ్యం అనే గ్రంథాన్ని విమర్శించడం జరిగింది. దీని రచయితలు బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు
హైదరాబాద్-1943 :
- అధ్యక్షుడు - కె.వి.రంగారెడ్డి
- మొదటిసారిగా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి
- అంధ్ర సారస్వత పరిషణ్ ఏర్పాటు గురించి ఈ సభలో చర్చించబడింది
భువనగిరి (నల్గొండ)-1944 :
అధ్యక్షుడు - రావి నారాయణరెడ్డి
- 11వ సభయైన ఈ భువనగిరి ఆంధ్ర మహాసభ అతి ముఖ్యమైనది
- సభ్యత్వ రుసుము 4 అణాల నుండి 1 అణాకు తగ్గించారు
- ఈ సభలోనే ఆంధ్రా మహాసభ అధికారికంగా మితవాదులు, అతివాదులుగా చీలిపోయింది
- ఇక నుండి వేర్వేరుగా సభలు నిర్వహించుకొనుటకు నిర్ణయించారు.
- ఈ సభ తర్వాత ఆంధ్ర మహాసభ యొక్క శాఖలు తెలంగాణాలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ శాఖలనే సంగములు అని పిలిచేవారు
మడికొండ (వరంగల్-1 945 :
- ఇది మితవాదుల సభ
- అధ్యక్షుడు - మందముల నర్సింగరావు
- సభ్యత్వ రుసుం 1 అణా నుండి రూ. 1కి పెంచారు
ఖమ్మం -1945 :
- ఇది అతివాదుల సభ
- అధ్యక్షుడు - రావి నారాయణరెడ్డి
- పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్న సభ. వెట్టి చాకిరీ రద్దు చేయాలని తీర్మానం
- బుర్రకథ కళకారుడు నాజర్ ఈ సభకు హాజరయ్యాడు
కంది (మెదక్) -1946 :
- ఇది మితవాదుల సభ
- అధ్యక్షుడు - జమలాపురం కేశవరావు
కరీంనగర్ - 1946 :
- ఇది అతివాద సభ
- అధ్యక్షుడు - బద్దం ఎల్లారెడ్డి
- 1946లో జరిగిన ఈ రెండు సభలు కూడా ఆంధ్ర మహాసభ యొక్క చివరి సభలుగా పరిగణించబడుతాయి.
- దీని తరువాత ఆంధ్ర మహాసభలోని మితవాదులు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరిపోగా అతివాదులు కమ్యూనిస్ట్ పార్టీలో చేరిపోయారు.
