అసఫ్ జాహీల చరిత్ర

TSStudies
0
Asaf Jahi Dynasty in telugu

History of Asaf Jahi Dynasty

స్థాపకుడు
నిజాం ఉల్-ముల్క్ 
చివరివాడు
మీర్ ఉస్మాన్ అలీఖాన్ 
రాజధాని
ఔరంగాబాద్, హైదరాబాద్ 
భాష
పారశీకం, ఉర్దూ 
తెగ
తురానీ
సంస్కరణల మూలపురుషుడు
1 సాలార్ జంగ్ 
  • దక్షిణ భారతదేశ మధ్యభాగంలో అనగా దక్కన్ పీఠభూమిలో 224 సంవత్సరముల పాటు పాలించిన అసఫ్ జాహీలు  సౌదీ అరేబియాకు (అప్పట్లో టర్కీ రాజ్యంలో అంతర్భాగం) చెందిన వారు 
  • భారత దేశంలోని 562 సంస్థానాల్లో అతిపెద్ద సంస్థానం - హైదరాబాద్ 
  • అసఫ్ జాహీలు టర్కీ (సౌదీ అరేబియా) లోని తురానీ  తెగకు చెందిన వారు.  
  • ఔరంగజేబు  పాలనా కాలంలో తురానీ తెగవారు భారతదేశంలోకి ప్రవేశించారు 
  • ఔరంగజేబు తురానీతెగకు చెందిన మీర్ ఖమ్రుద్దీన్, అతని తండ్రి మరియు తాతలకు ఉన్నత పదవులు ఇచ్చాడు
  • మీర్ ఖమ్రుద్దీన్ క్రింది మొగల్ చక్రవర్తుల వద్ద పని చేసాడు
ఔరంగజేబు
4000 మన్సబ్ దారీ ర్యాంక్
1 షా ఆలం
అవధ్ సుబేదార్
ఫారూఖ్ సియార్
దక్కన్ సుబేదార్ 
మొహమ్మద్ షా రంగీలా
మాళ్వ  సుబేదార్ & మొఘల్ ప్రధాని
  • సయ్యద్ సోదరులు (అబ్దుల్లా మరియు హుస్సేన్) మహమ్మద్ షా రంగీలాను ఒక కీలుబొమ్మలాగా నియంత్రించేవారు 
  • సయ్యద్ సోదరులను హతమార్చడంలో మీర్ ఖమ్రుద్దీన్ కీలక పాత్ర పోషించాడు
  • దీని తరువాత అతను కొంతకాలం ఢిల్లీలో మొగల్ ప్రధానిగా పనిచేశారు ఢిల్లీలో కుట్రలు అధికంగా ఉండటం వల్ల దక్కన్ లో స్వతంత్ర పరిపాలన చేసుకోవాలని నిర్ణయించాడు
  • 1724 అక్టోబర్ లో  మీర్ ఖమ్రుద్దీన్ షఖర్ఖేదా యుద్ధంలో అప్పటి దక్కన్ సుబేదార్ అయిన ముబారీజ్ ఖాన్ ను ఓడించి తన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు
  • తాను మొఘల్ సామంతగా ఉంటూ స్వతంత్ర పరిపాలన చేస్తానని ప్రకటించాడు
  • దీంతో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా మీర్ ఖమ్రుద్దీన్ అసఫ్ జా అనే బిరుదును ఇచ్చి దక్కన్ సుబేదారుగా నియమించాడు
  • అప్పటినుండి అసఫ్ జాహీల  పాలన ఆరంభమైనది

Tags: Founder of Asaf Jahi Dynasty, Last ruler of Asaf Jahi Dynasty, First Capital of Asaf Jahi Dynasty, Asaf Jahi Dynasty Language, Asaf Jahi Dynasty Founder, History of Asaf Jahi Dynasty in Telugu, History of Nizams in Telugu, Nizams History in Telugu, First Nizam of Hyderabad, First Nizam of Asaf Jahi Dynasty, Asaf Jahi Dynasty Rulers, Nizam Dynasty Rulers, List of Nizam rulers in telugu, List of Asaf Jahis

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top