History of Recherla Nayakas Dynasty
రేచర్ల పద్మ నాయకులను వెలమ నాయకులు అని కూడా అంటారు.
వీరి యొక్క మొదటి రాజధాని అనుమానగల్లు తరువాత రాచకొండ, దేవరకొండలను చేసుకుని పాలించారు
వీరి వంశానికి చెందినవారు దేవరకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించారు
ఈ వంశం యొక్క స్థాపకుడు సింగమనాయకుడు
వీరిలో గొప్పవాడు 2వ సింగ భూపాలుడు
వీరియొక్క పూర్వికులు కాకతీయ వంశంలో ఉన్నతమైన పదవులు చేపట్టారు.
సింగమనాయుడు 2వ ప్రతాపరుద్రుడునికి సేనాధిపతిగా ఉన్నాడు
రేచర్ల వెలమ వంశం (Recharla Velama Dynasty)
- సింగమనాయుడు (క్రీ.శ.1326-1361)
- మొదటి అనవోతనాయకుడు (క్రీ.శ.1361-1384)
- 2వ సింగభూపాలుడు (క్రీ.శ.1384-1399)
- 2వ అనవోతనాయకుడు (క్రీ.శ.1399-1421)
- మాదానాయకుడు (క్రీ.శ.1421-1430)
- 3వ సింగమనాయకుడు (క్రీ.శ.1430-1475)
దేవరకొండ వెలమ పాలకులు (Devarakonda Velama Dynasty)
దేవరకొండ రాజ్యాన్ని 1287 నుంచి 1475 వరకు 8 మంది రాజులు పరిపాలించారు. వారిలో ముఖ్యమైన కొందరు రాజులు .
- రాజా మాధానాయుడు 2
- రాజా పెదవేదగిరి నాయుడు (క్రీ.శ.1384-1410)
- రాజా మాదానాయడు 3 (క్రీ.శ.1410-1425)
- రాజా లింగమనాయుడు (క్రీ.శ.1425-1475)
సింగమనాయుడు (క్రీ.శ. 1326-1361) Recharla Velama Singhama Nayak
- ఇతను వెలమ వంశ స్థాపకుడు
- ఇతను అనుమనగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.
- ఇతను జల్లిపల్లి కోటను ఆక్రమించే క్రమంలో సోమవంశ క్షత్రియులచే హతమార్చబడ్డాడు
- ఇతని తరువాత ఇతని కుమారుడు మొదటి అనవోతానాయకుడు పాలకుడయ్యాడు.
మొదటి అనవోతనాయకుడు (క్రీ.శ.1361-1384)
- ఇతను రాజధానిని అనుమనగల్లు నుంచి రాచకొండకు మార్చాడు
- ఇతను పరిపాలన సౌలభ్యం కొరకు రాజ్యాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి ఇతను ఉత్తర భాగానికి తన తమ్ముడును దక్షిణ భాగానికి దేవరకొండ రాజధానిగా పరిపాలన కొనసాగించారు.
- అప్పటినుంచి మదనాయకుడు వంశీయులు దేవరకొండ నుంచి పరిపాలించారు.
- ఇతని కాలంలోనే నాగనాథుడు విష్ణుపురాణంను రచించాడు.
- ఇతని తరువాత ఇతని 2వ సింగభూపాలుడు రాజ్యాన్ని అధిష్టించాడు.
కుమార సింగభూపాలుడు/2వ సింగభూపాలుడు (క్రీ.శ.1384-1399)
- ఇతని యొక్క బిరుదులు సర్వజ్ఞ చక్రవర్తి,సర్వజ్ఞ చూడామణి, కళ్యాణిభూపతి, ప్రతి పండ భైరవ
- ఇతనియొక్క రచనలు రసార్ణవ సుధాకరం, రత్న పాంచాలిక, సంగీత సుధాకరము
- ఇతను యువరాజుగా ఉన్నప్పుడు కల్యాణదుర్గన్ని ఆక్రమించి కళ్యాణి భూపతి అనే బిరుదు పొందాడని ఇతని ఆస్థాన కవి విశ్వేశ్వరుడు తన చమత్కార చంద్రిక అనే ప్రస్తావించాడు.
2వ అనపోత నాయకుడు (క్రీ.శ.1399-1421)
- వెలుగోటి వంశావళి గ్రంథం ఇతని యొక్క విజయాలను ప్రస్తావించింది.
- ఇతని కాలంలోనే వెలమ మరియు బహుమనీ ల మధ్య సంబంధాలు చెడిపోయినవి
- ఇతను (క్రీ.శ. 1417 లో బహుమనీలకు వ్యతిరేకంగా విజయనగర రాజులతో కలిసి వారిని ఓడించాడు.
మాదానాయకుడు (క్రీ.శ.1421-1430)
- ఇతను 2వ అనవోతా నాయకుడి సోదరుడు
- (క్రీ.శ. 1425 లో అహ్మద్ షా వరంగల్ ను ఆక్రమించాడు. దీనితో మదనాయకుడు బహుమనీలతో సంధి చేసుకుని వరంగల్ ను తిరిగి పొందాడు.
- ఇతను రామానుజాచార్యుని కుమారుడైన వెంకటచార్యుని శిష్యుడు
- ఇతని భార్య నాగాంబిక క్రీ.శ.1429 లో రాచకొండ సమీపంలో నాగసముద్రం అనే చెరువు త్రవ్వించింది.
3వ సింగమ నాయకుడు (క్రీ.శ.1430-1475)
- ఇతను 2వ అనవోతానాయకుడి కుమారుడు
- ఇతని యొక్క బిరుదులు ముమ్మడి సింగమనాయుడు, సర్వజ్ఞరావ్ సింగమనాయుడు
- ఇతని కాలంలోనే అహ్మద్ షా తెలంగాణను ఆక్రమించారు.
- తరువాత బహుమాని రాజు హుమాయూన్ దేవరకొండను కూడా ఆక్రమించాడు.
- దీనితో తెలంగాణ మొత్తం బహుమనీల ఆధీనంలోకి వచ్చింది.
- ధర్మనాయుడు శాయంపేట శాసనం వేయించాడు.