Role of Aadi Hindu Udyamam in Nizam's State
- తెలంగాణలో జరిగిన దళిత ఉద్యమాలను ఆదిహిందూ ఉద్యమాలు అంటారు
- ఆదిహిందూ ఉద్యమం చేపట్టిన వారు - భాగ్యరెడ్డివర్మ.
- ఇతని అసలు పేరు మాదిరి భాగయ్య
- భారతదేశంలో తామే మూలవాసులమని, ఆ మూలవాసులే రేడులు అంటే రెడ్లు అని తన పేరుకు రెడ్డి అనే పదాన్ని చేర్చుకున్నాడు
- భాగ్యరెడ్డివర్మ 1888 మే 22న హైదరాబాద్‌లో మాల సామాజిక వర్గంలో జన్మించాడు
- ఇతను తెలంగాణ మరియు ఆంధ్రా ప్రాంతాలను కలుపుకొని దళిత ఉద్యమాన్ని చేపట్టాడు
- 1906లో జగన్మిత మండలిని హైదరాబాద్‌లో స్థాపించడంతో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో దళిత ఉద్యమాలు
- ప్రారంభమయ్యాయి. జగన్మిత మండలి ద్వారా నాటకాలు, బుర్రకథలు, భజనలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయుటకు ప్రయత్నించాడు.
- 1906లోనే భాగ్యరెడ్డివర్మ నాయకత్వంలో ఒక వాలంటీర్ దళం హైదరాబాద్‌లో పనిచేయడం ప్రారంభించింది. దీని
- ముఖ్య ఉద్దేశం - అస్పృశ్యతా నివారణ
- జగన్మిత మండలి కార్యక్రమాల్లో భాగంగా 1910లో ఇస్లావియా బజార్‌లో, లింగంపల్లి లో ప్రాథమిక పాఠశాలలను స్థాపించాడు.
- మొత్తంగా జంట నగరాల్లో 26 ఆది హిందూ పాఠశాలలు స్థాపించాడు
- 1911లో మన్య సంఘంను స్థాపించి క్రింది అంశాలను వ్యాప్తి చేశాడు. ఇదే తర్వాత కాలంలో ఆదిహిందూ సోషల్ సర్వీస్‌లీగ్‌గా ప్రసిద్ధి చెందింది
- విద్యావ్యాప్తి
- బాల్య వివాహాల రద్దు
- జోగినీ వ్యవస్థ రద్ద
- మత్తుపానీయాల నిషేధం
- శుభకార్యాలలో మాంసాహారాన్ని భుజించకూడదు
మన్య సంఘం కార్యవర్గం:
- అధ్యక్షుడు: వల్తాటి శేషయ్య
- ఉపాధ్యక్షుడు: హెచ్.ఎస్. వెంకట్రావ్
- కార్యదర్శి: జె .యస్.ముత్తయ్య
- కార్యనిర్వాహక కార్యదర్శి: భాగ్యరెడ్డివర్మ
- *భాగ్యరెడ్డివర్మ దేవదాసీ వ్యవస్థను నిషేధించడానికి దేవదాసీ నిర్మూలన _సంఘం స్థాపించాడు
- 1912లో భాగ్యరెడ్డివర్మ స్వస్తిక్‌దళ్ అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశాడు.
- దీని అధ్యక్షులు - బందెల చిత్తరంజన్
- 1918లో బాలాజీ కృష్ణారావు (ఇతని గురువు) భాగ్యరెడ్డికి వర్మ అనే బిరుదునిచ్చి ఆర్య సమాజ్ దీక్షను ఇచ్చాడు
- 1915లో సంఘ సంస్కార నాటక మండలి మరియు బౌద్ధమతం యొక్క ప్రభావంతో జీవరక్షా ప్రచారక మండలిని
- ఏర్పాటు చేశాడు.
- 1917 నవంబర్ 4, 5 తేదీల్లో గూడూరు రామచంద్రరావుబెజవాడలోని మైలవరం రాజయ్య నాటక మందిరంలో మొదటి ప్రాదేశిక పంచమ సదస్సును నిర్వహించాడు.
- భాగ్యరెడ్డివర్మ ఈ సదస్సుకు అధ్యక్షత వహించాడు
- పంచములు లేదా దళితులు భారతదేశం యొక్క మూల వారసులని ఇక నుండి వారిని ఆది ఆంధ్రులు లేదా ఆది హిందువులుగా పిలవాలని భాగ్యరెడ్డివర్మ ఈ సదస్సులో పేర్కొన్నాడు
- భాగ్యరెడ్డివర్మ సూచన మేరకు పంచమ సదస్సు ఆది ఆంధ్రుల సదస్సుగా మారింది
- *అప్పటి నుండి కోస్తా ఆంధ్రాలో దళిత ఉద్యమాలు ఆది ఆంధ్రా ఉద్యమాలుగా, తెలంగాణలో జరిగిన ఉద్యమాలు ఆది
- హిందూ ఉద్యమాలుగా పిలవబద్దాయి.
- 1917లో భాగ్యరెడ్డివర్మ అధ్యక్షతన అఖిల భారత ఆదిహిందూ సభ సమావేశం హైదరాబాద్‌లోని ప్రేమ్ థియేటర్‌లో జరిగింది
- ఈ సమావేశంలోనే అంటరానివారిని ఆది హిందువులు అని గౌరవంగా పిలవాలని నిజాం ప్రభుత్వం చేత చట్టం చేయించాడు.
- 1912లో అహింసా సమాజంను స్థాపించాడు
- 1918 డిసెంబర్ 31న జె.ఎస్.ముత్తయ్య సంపాదకుడిగా 'ది పంచమ' అనే ఆంగ్ల మాసపత్రిక ప్రారంభమైంది
- 1919లో భాగ్యరెడ్డివర్మ మచిలీపట్నంలో 2వ ఆది ఆంధ్ర సదస్సును నిర్వహించి దళిత విద్యావ్యాప్తి కొరకు తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాడు
- 1922 మార్చి 29-31 తేదీల్లో అఖిల భారత ఆదిహిందూ సోషల్ కాన్ఫరెన్స్ సభ దళిత భీమ్మడిగా పేరొందిన ఎం.యల్.ఆదయ్య ఆధ్వర్యంలో జరిగింది.
- ఆదిపాందూ సోషల్‌లీగ్ నికింద్రాబాద్ శాఖకు ఎం.యల్. ఆదయ్య ఎన్నికయ్యారు
- ఎం.యల్. ఆదయ్య అధ్యక్షతన ఆదిహిందూ మహాసభ ఏర్పడింది
- *హైదరాబాద్ అంబేద్కర్ గా బి.యస్. వెంకట్రావును పేర్కొంటారు
- 1922లో బి.యస్. వెంకట్రావు ఆది ద్రావిడ సంఘం స్థాపించాడు
- 1922లో భాగ్యరెడ్డివర్మ ఆదిహిందూ సాంఘిక సేవాసమితి అనే ట్రస్టును ఏర్పాటు చేశాడు
- 1925లో హైదరాబాద్‌లో కలరా, ప్లేగు వ్యాధులు సంభవించినపుడు భాగ్యరెడ్డివర్మ స్వచ్ళంద ఆరోగ్య సేవాదళం ఏర్పాటు చేసి ఈ వ్యాధుల నిర్మూలనలో కీలక పాత్ర పోషించాడు.
- అప్పుడే భాగ్యారెడ్డివర్మ హైదరాబాద్ ప్రజల మన్నన పొందాడు.
- 1925లో రాజా ప్రతాప్ గిర్‌జీ హైదరాబాద్‌లో హిందూ ధర్మ పరిషత్ అనే మత సదస్సు నిర్వహించాడు
- ఈ సదస్సులో భాగ్యరెడ్డివర్మ యొక్క ప్రసంగం అగ్రవర్ణాల వారి హృదయాలను కదల్చివేసింది
- 1925లో ఆది హిందువులు రూపొందించిన శిల్పాలను, ఇతర కళా ఖండాలను హైదరాబాద్‌లోని రెసిడెన్సీ బజార్‌లో ప్రదర్శించాడు
- దీని ద్వారా ఆదిహిందువుల నైపుణ్యతను ప్రపంచం మొత్తానికీ తెలియజేయాలనుకొన్నాడు
- 1925లో సుబేదార్ సాయన్న అధ్యక్షతన భాగ్యరెడ్డివర్మ ఆదిహిందూ బస్తీలలో సభలు నిర్వహించి వారిని చైతన్య పరిచాడు.
